శుక్రవారం 03 జూలై 2020
International - May 25, 2020 , 01:51:36

అరసెకన్‌లో వెయ్యి సినిమాల డౌన్‌లోడ్‌!

అరసెకన్‌లో వెయ్యి సినిమాల డౌన్‌లోడ్‌!

మెల్‌బోర్న్‌: వెయ్యి సినిమాలను కేవలం 0.5 సెంకడ్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగమైన ఇంటర్నెట్‌ కోసం ఆస్ట్రేలియాలో పరిశోధనలు జరుగుతున్నాయి. మోనాష్‌, స్విన్బర్నే, ఆర్‌ఎంఐటీ యూనివర్శిటీలకు చెందిన బృందం, డేటా పంపిణీలో ఓ విప్లవాత్మక మార్పునకు నాంది పలికింది. వారు తయారు చేసిన ‘మైక్రో-కోంబ్‌' ఆప్టికల్‌ చిప్‌లో వందలాది ఇన్‌ప్రారెడ్‌ లేజర్లుంటాయి. వీటి ద్వారా ఒక సెకనులో 44.2 టెరాబైట్ల డేటాను పంపవచ్చు. దీని వల్ల ఇంటర్నెట్‌ వేగం పది లక్షల రెట్లు పెరుగుతుంది. మెల్‌బోర్న్‌లోని ఆర్‌ఎంఐటీ, మోనాష్‌ వర్సిటీ క్యాంపస్‌ మధ్య డార్క్‌ ఆప్టికల్‌ ఫైబర్స్‌పై దీన్ని పరీక్షించారు. 


logo