శనివారం 30 మే 2020
International - May 14, 2020 , 19:41:17

క‌రోనా కాలంలో ఇలా హ‌గ్ చేసుకోవాల‌ట‌!

క‌రోనా కాలంలో ఇలా హ‌గ్ చేసుకోవాల‌ట‌!

సాధార‌ణంగా పిల్ల‌లు మాట విన‌రు. క‌రోనా కాలంలో అల్ల‌రి చేసే పిల్ల‌లే ఇప్పుడు మాట వింటున్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి మాస్కులు ధ‌రించాలి. అలాగే సామాజిక దూరం పాటించాల‌ని మొత్తుకుంటూనే ఉన్నారు. ఇవి ఎవ‌రు పాటించినా, పాటించ‌క‌పోయినా కాలిఫోర్నియాకు చెందిన 10 ఏండ్ల పీజ‌స్ అనే అమ్మాయి చాలా చ‌క్క‌గా రూల్స్ పాటిస్తున్న‌ది. అమ్మ‌మ్మ‌ను చూసిన ఆనందంలో హ‌గ్ చేసుకోకుండా ఉండ‌లేకపోయింది. కానీ, ఇప్పుడు కూడా రూల్స్ బ్రేక్ చేయ‌లేదు. మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లౌజులు త‌యారు చేసిన‌ ట్యుటోరియ‌ల్స్‌ను యూట్యూబ్‌లో చూసింది పీజ‌స్. అదేవిధంగా ఒక ప్లాస్టిక్ క‌ర్టెన్‌ను త‌యారు చేసింది. చేతులు దూరేలా త‌యారు చేసి అమ్మ‌మ్మ‌ను హ‌గ్ చేసుకున్న‌ది. మ‌న‌సుంటే మార్గం ఉంట‌ది అనే స‌త్యాన్ని ఈ చిన్నారి రుజువు చేసింది. లిండ్‌సే ఈ ఫొటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. 


logo