గురువారం 04 జూన్ 2020
International - May 05, 2020 , 20:29:05

గల్ఫ్‌లో 10 వేల మంది భారతీయులకు కరోనా!

గల్ఫ్‌లో 10 వేల మంది భారతీయులకు కరోనా!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కలకలం రేపుతూనే ఉన్నది. దేశంలోనూ కరోనా రక్కసి రోజురోజుకు పుంజుకుంటున్నది. ఇప్పటికే దేశంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 50 వేలకు చేరువయ్యింది. విదేశాల్లోనూ భారతీయులు భారీ సంఖ్యలో కరోనా బారినపడ్డారు. కేవలం గల్ఫ్‌ దేశాల్లోనే 10 వేల మందికి పైగా భారతీయులకు కరోనా వైరస్‌ సోకిందని వార్తలు వెలువడుతున్నాయి. అదేవిధంగా గల్ఫ్‌లో భారతీయుల మరణాల సంఖ్య కూడా 84కు చేరిందని తెలిసింది. గల్ఫ్‌ దేశాలతోపాటు అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లోనూ కరోనా బారినపడిన భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. logo