సోమవారం 01 జూన్ 2020
International - Apr 28, 2020 , 02:15:48

మిలియన్‌ మార్కు!

మిలియన్‌ మార్కు!

  • అమెరికాలో 10 లక్షల కేసులు.. 55 వేల మృతులు
  • మొత్తం కేసుల్లో 33 శాతం, మృతుల్లో 25శాతం ఇక్కడే

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా కేసు లు మిలియన్‌ మార్కుకు (పది లక్షలకు) చేరువయ్యాయి. జాన్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ఆదివారం నాటికి 9,64,937 కేసులు నమోదుకాగా, 54,841 మంది మృతిచెందారు. ప్రపంచంలో కరోనా కేసులు 30 లక్షలు దాటాయి. ఇందులో మూడింట ఒక వంతు అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచ దేశాల్లో 2.07 లక్షల మరణాలు నమోదుకాగా, పావు శాతం మంది మృతులు అమెరికా వారే.మొత్తం మరణాల్లో సగం మంది మృతులు (28 వేల మంది), మొత్తం కేసుల్లో పాతిక శాతం (నాలుగు లక్షలు) న్యూయార్క్‌, న్యూజెర్సీలోనే నమోదయ్యాయి. కాగా, వాణిజ్య కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఉవ్విళ్లూరుతున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధికారంలో ఉన్న జార్జియా, ఓక్లాహామా, అలస్కా తదితర రాష్ర్టాల్లో ఆంక్షల్ని సడలిస్తున్నారు. ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ అధికారంలో ఉన్న న్యూయార్క్‌, మిషిగాన్‌ రాష్ర్టాల్లో మే మూడో వారం వరకు ఆంక్షలు కొనసాగుతాయని రాష్ర్టాల గవర్నర్లు వెల్లడించారు. 


logo