శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 16:08:42

పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదం : 10 మంది దుర్మరణం

పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదం : 10 మంది దుర్మరణం

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. వ్యాన్, ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని కరాచీ-క్వెట్టా రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం 20 మంది ప్రయాణికులతో నిండిన వ్యాన్ వెళుతుండగా ముందు నుంచి వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ట్రక్కులో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా.. చాలా మంది గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, దవాఖానలో చికిత్స పొందుతూ ఏడుగురు చనిపోయారు. గాయపడిన వారిని స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని దవాఖాన అధికారులు చెప్తున్నారు. వ్యాన్ చాలా ఇరుకైనందున చాలా మంది ప్రజలు వ్యాన్ పైకప్పుపై ప్రయాణిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ కారణంగా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు


logo