శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 15, 2021 , 23:05:47

ఆఫ్ఘన్‌లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి

ఆఫ్ఘన్‌లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు మళ్లీ చెలరేగిపోయారు. భద్రతా దళాలే లక్ష్యంగా తాలిబన్లు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. దీంతో 35 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఈ ఘటన ఘజ్నీ రాష్ట్రంలోని కాబూల్‌-కాందహర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది. అయితే,  దీనికి తమదే బాధ్యత అని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకోలేదు.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వాన్ని, ఆఫ్ఘన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ (ఏఎన్‌డీఎస్‌ఎఫ్‌)ను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo