శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 02, 2020 , 22:14:59

ఆత్మహుతి దాడి‌లో ఒకరు మృతి.. 18 మందికి గాయాలు

ఆత్మహుతి దాడి‌లో ఒకరు మృతి.. 18 మందికి గాయాలు

జలాలాబాద్ : ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌ జైలు ప్రవేశద్వారం వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారని నంగర్హర్ గవర్నర్ అటావుల్లా ఖోగ్యానీ అధికార ప్రతినిధి చెప్పారు. పేలుడు పదార్థాలతో నిండిన కారును నడుపుతూ వచ్చిన వ్యక్తి జైలు పీడీ-4 ద్వారం సమీపంలోకి రాగానే తనను తాను పేల్చుకున్నాడు. సమీపంలో కాల్పులు సైతం వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉగ్రవాదులు సమీపంలోని భవనం పైఅంతస్తులో ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఘటనను ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ ధ్రువీకరించినా ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదని టోలో న్యూస్ పేర్కొంది. దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.


logo