వాషింగ్టన్: అమెరికాలో టెన్నిసెసి సూపర్మార్కెట్లో కాల్పుల ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో 12 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగించిన సాయుధుడిని షూట్ చేశారు. మెమ్పిస్కు శివారులో ఉన్న కొల్లిర్విల్లేలోని క్రోగర్ గ్రాసరీ స్టోర్లో ఈ ఘాతుకం జరిగింది. సాయుధుడు జరిపిన కాల్పుల్లో కొందరికి తీవ్రమైన గాయాలు అయినట్లు పోలీసు చీఫ్ డేల్ లేన్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. కాల్పుల ఘటన జరగ్గానే.. స్వాట్ దళాలు ఆ సూపర్మార్కెట్ను చుట్టుముట్టేశాయి. మాల్లో ఉన్న జనం భయంతో ఫ్రీజర్లలో దాక్కున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎఫ్బీఐతో పాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నాయి.