శుక్రవారం 03 జూలై 2020
International - Jul 01, 2020 , 08:35:08

ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు 1.85 లక్షల కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు 1.85 లక్షల కరోనా కేసులు

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చుతున్నది. గత పదిరోజులుగా ప్రతి రోజు లక్షన్నరకు పైగా కొత్తకేసులు రికార్డవుతున్నాయి. తాజాగా మరో లక్షా 85వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,05,85,152కు చేరింది. ఈ వైరస్‌ వల్ల గత 24 గంటల్లో 5023 మంది మరణించారు. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటివరకు మొత్తం 5,13,913 మంది మృతిచెందారు. మొత్తం నమోదైన కేసుల్లో 57,95,009 మంది కోలుకోగా, 42,18,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. దేశంలో నిన్న ఒక్కరోజే కొత్తగా 47వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కాలిఫోర్నియా, ఆరిజోనా, టెక్సాస్‌లు కరోనాకు కేంద్రంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 27,27,853 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1,30,122 మంది బాధితులు మరణించారు. కరోనా బారినపడినవారిలో 11,43,334 మంది కోలుకోగా, 14,54,397 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. లాటిన్‌ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిన్న ఒక్కరోజే 37,997 కేసులు నమోదవగా, 1271 మంది చనిపోయారు. దీంతో బ్రెజిల్‌లో కరోనా కేసుల సంఖ్య 14,08,485కు చేరింది. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 59,656 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 5,58,789 యాక్టివ్‌ కేసులు ఉండగా, 7,90,040 మంది కోలుకున్నారు. మూడో స్థానంలో ఉన్న రష్యాలో 6,47,849 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ వైరస్‌ బారిన పడిన 4,12,650మంది కోలుకోగా, మరో 2,25,879 మంది చికిత్స పొందుతుండగా, 9320 మంది మృతిచెందారు. 

ఇక భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 5,85,792కు చేరింది. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 2,25,546 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,47,836 మంది బాధితులు కోలుకున్నారు. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 17,410 మంది మరణించారు. యూకేలో కరోనా కేసుల సంఖ్య 3,12,654కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 43730 మంది మృతిచెందారు. కరోనా కేసుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో ఇప్పటివరకు 2,96,351 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 28,355 మంది మృతిచెందారు. పెరులో కరోనా కేసుల సంఖ్య 2,85,213కు చేరింది. దేశంలో ఈ వైరస్‌ బారినపడిన వారిలో 9677 మంది చనిపోయారు. 

అత్యధిక కరోనా కేసుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్న చిలీలో ఇప్పటివరకు 2,79,393 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల 5688 మంది మృతిచెందారు. ఇటలీలో 2,40,578 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 34,767 మంది మరణించారు. పదో స్థానంలో ఉన్న ఇరాన్‌లో ఇప్పటివరకు 227,662 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 10817 మంది మృతిచెందారు.

మెక్సికోలో నిన్న ఒక్క రోజే కొత్తగా 5432 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,26,089కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 27,769 మంది మరణించారు. గత 24 గంటల్లో 648 మంది మృతిచెందారు. ఇలా భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండతంతో మెక్సికో త్వరలోనే ఇరాన్‌ను వెనక్కి నెట్టే అవకాశం ఉన్నది.


logo