బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 19, 2020 , 19:14:01

పాకిస్థాన్‌లో కరోనా విలయం

పాకిస్థాన్‌లో కరోనా విలయం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో కరోనా రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం అంతకంతకూ మృతులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో  కొత్తగా 1,579 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 46 మంది మృతి చెందారు. ఆ దేశంలో ఇప్పటివరకు 2,63,496 కరోనా కేసులు నమోదవగా 5,568 మంది మృతి చెందారు. సింద్‌ ప్రావిన్స్‌లో 1,12,118 కేసులు, పంజాబ్‌లో 89, 793 కేసులు, ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 31,890 కేసులు, బలుచిస్థాన్‌లో 11,424 కేసులు, ఇస్తామాబాద్‌లో 14,576 కేసులు, గిలిగిట్‌ బలుచిస్థాన్‌లో 1,807 కేసులు నమోదయ్యాయి. సింద్‌ ప్రావిన్స్‌లో 3,249 మంది పదోళ్లలోపు పిల్లలు, 22,554 మంది 50 ఏండ్లలోపువారు కరోనా మహమ్మారి బారినపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించకుండా బయటకు వెళ్లవద్దని ఆయన కోరారు. 


logo