గురువారం 02 జూలై 2020
International - May 31, 2020 , 15:00:00

అమెరికాలో అల్లర్లు.. 14 వందల మంది అరెస్ట్‌

అమెరికాలో అల్లర్లు.. 14 వందల మంది అరెస్ట్‌

వాషింగ్టన్‌: అమెరికాలో జాత్యహంకారంపై నల్లజాతీయుల నిరసనలు కొనసాగుతున్నాయి. గత సోమవారం మిన్నెపొలిస్‌లో పోలీస్‌ అధికారి చేతిలో హత్యకుగురైన జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల శాంతియుతంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో 17 నగరాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న 1398 మంది అరెస్టు చేశారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఫ్లాయిడ్‌కు న్యాయం చేయాలంటూ ప్రజలు భారీసంఖ్యలో నిరసనకార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో, ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన పోలీస్‌ అధికారిపై హత్య కేసు నమోదుచేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.


logo