మాడ్రిడ్, జనవరి 19: ప్రపంచంలోనే అత్యంత వృద్ధునిగా గిన్నెస్ రికార్డులలోకి ఎక్కిన శాటుర్నినో గార్షియా 112వ ఏట మరణించారు. 113వ పుట్టిన రోజుకు కేవలం మూడు వారాల ముందే స్పానిష్ ఉత్తరాది నగరమైన లియోన్లోని స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. లియోన్ సమీపంలోని పుయెంటో కాస్ట్రోలో ఆయన 1909 ఫిబ్రవరి 11న జన్మించారు. మీ దీర్ఘాయువు రహస్యం ఏంటని అడిగితే ‘ప్రశాంత జీవనం’ అని చెప్పేవారాయన. అంతేకాదు, తాను కురచగా ఉండడం కూడా తనకు కలిసి వచ్చిందని అనేవారు. లేకపోతే జనరల్ ఫ్రాంకో సైన్యంలో చేరాల్సి వచ్చేదని చమత్కరించేవారు. గత సెప్టెంబర్ 10న ఆయన 112 సంవత్సరాల 211 రోజులతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు.