న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారని, కాని ఏకాంత కారాగారవాసంలో మానసిక చిత్రవధను ఆయన అనుభవిస్తున్నారని ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ మంగళవారం రావల్పిండిలోని అదియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలుసుకున్న తర్వాత వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే కనపడినట్లు ఉజ్మా ఖాన్ పేర్కొన్నట్లు పీటీఐ ఓ ప్రకటనలో తెలిపింది.