e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home అంతర్జాతీయం పాత ఇమ్మిగ్రేషన్‌కే బైడెన్‌ సుముఖం

పాత ఇమ్మిగ్రేషన్‌కే బైడెన్‌ సుముఖం

వాషింగ్టన్‌: అమెరికా వీసాలపై ట్రంప్‌ విధించిన ఆంక్షలు తొలగించి పాత వలస విధానాన్ని అమలుచేసేందుకు నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ సుముఖంగా ఉన్నారని వైట్‌హౌస్‌ వర్గాలు ప్రకటించాయి. కొద్దివారాలుగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. అవి ఆరంభం మాత్రమేనని చాలా విధానాల్లో కీలక మార్పులు ఉంటాయని వైట్‌హౌస్‌ సీనియర్‌ ప్రతినిధి ఒకరు గురువారం మీడియాకు తెలిపారు. అమానవీయ, అనైతిక, వర్గాలవారీగా విభజించే విధానాలను సవరించే పనిలో అధ్యక్షుడు ఉన్నారని వెల్లడించారు. అమెరికాలో శాశ్వత నివాసం, గ్రీన్‌కార్డు జారీకి ఉన్న పరిమితిని తొలగించేవరకు భారత్‌లో జన్మించినవారికి హెచ్‌1బీ వీసా ఇవ్వొద్దని ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యంవహిస్తున్న ఇమ్మిగ్రేషన్‌ వాయిస్‌ పిలుపు నేపథ్యంలో వైట్‌హౌస్‌ వర్గాలు ఈమేరకు ప్రకటన చేశాయి.

బీబీసీపై చైనా నిషేధం

ఇంగ్లండ్‌ వార్తా సంస్థ బీబీసీపై చైనా నిషేధం విధించింది. ఎత్తుకు పైఎత్తులో భాగంగా బ్రిటన్‌పై ఈవిధంగా ప్రతీకారం తీర్చుకున్నది. వారంక్రితం చైనా గ్లోబల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ (సీజీటీఎన్‌) ప్రసారాలను నిలిపివేస్తున్నట్టు బ్రిటిష్‌ మీడియా రెగ్యులేటర్‌ ప్రకటించింది. దీనికి ప్రతిగా బీబీసీని నిషేధిస్తున్నట్టు చైనా ప్రకటించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాత ఇమ్మిగ్రేషన్‌కే బైడెన్‌ సుముఖం

ట్రెండింగ్‌

Advertisement