యూట్యూబ్ చరిత్రలోనే అతి చెత్త వీడియో ఇదే..!

Fri,December 14, 2018 04:32 PM

YouTube Rewind 2018 is now the most disliked video on YouTube

యూట్యూబ్ సొంతంగా రిలీజ్ చేసిన ఓ వీడియో యూట్యూబ్ చరిత్రలోనే అత్యంత చెత్త వీడియోగా రికార్డుకెక్కింది. యూట్యూబ్‌లో యూజర్లు తమకు నచ్చిన వీడియో, కంటెంట్‌లకు ఎలాగైతే లైక్‌లు కొడతారో.. చెత్త వీడియోలకు డిస్‌లైక్ బటన్లు నొక్కేస్తారు. గతంలో ఫేమస్ హలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ రూపొందించిన మ్యూజిక్ వీడియోను 'బేబీ'ని 98 లక్షల మంది డిస్‌లైక్ చేశారు. అయితే దీనికి సుమారు ఏడేళ్ల సమయం పట్టింది.

తాజాగా యూట్యూబ్ విడుదల చేసిన 'యూట్యూబ్ రివైండ్ 2018' వీడియో మాత్రం వారం రోజుల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా కోటి పదిలక్షల మంది డిస్‌లైక్‌లతో యూట్యూబ్ చరిత్రలోనే అతి చెత్త వీడియోగా నిలిచిపోయింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోలు, ట్రెండింగ్‌లో ఉన్న కంటెంట్‌ను 2011 నుంచి ప్రతిఏడాది యూట్యూబ్ రివైండ్ పేరుతో విడుదల చేస్తోంది. కంటెంట్ క్రియేటర్స్‌కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోను యూట్యూబ్ ఆవిష్కరిస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఫన్నీగా చేసిన రివైండ్ 2018 వీడియో ప్రయత్నం విఫలమైంది.

5596
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles