యూట్యూబ్ రివైండ్ 2017 వీడియో చూశారా?

Thu,December 7, 2017 04:40 PM

youtube rewind 2017 video

యూట్యూబ్ ప్రతి సంవత్సరం చివరలో యూట్యూబ్ రివైండ్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేస్తుంది. ఈ సారి కూడా యూట్యూబ్ రివైండ్ 2017 పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది. దాదాపు 7 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నది. వీడియో అప్‌లోడ్ అయిన ఒక్క రోజులోనే దాదాపు 2 కోట్ల 60 లక్షల మంది దీన్ని వీక్షించారు. ఎద్ షీరన్ సూపర్ డూపర్ సాంగ్ షేప్ ఆఫ్ యూ మ్యూజిక్‌ను బేస్ చేసుకొని తీసిన ఈ వీడియో మాత్రం నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటున్నది. రివైండ్ వీడియోతో పాటు రివైండ్ మేకింగ్ వీడియోను కూడా యూట్యూబ్ అప్‌లోడ్ చేసింది. దీంతో.. రెండు వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.3659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS