తెలివి తక్కువ దొంగ.. గోల్డ్‌ చైన్ కొట్టేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు..!

Thu,December 6, 2018 03:47 PM

Young man Went To Rob Jewelry Store What Happened Next Will Make you laugh

దొంగతనం అంత వీజీ కాదు బాస్. అది కూడా ఓ ఆర్ట్. దానికీ ఎన్నో ప్లాన్లు వేయాలి. ఎంతో శ్రమించాలి. ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ తర్వాతే రంగంలోకి దిగాలి. అప్పుడే దొంగతనం వందకు వంద శాతం వర్కవుట్ అవుతుంది. లేదంటే దొంగతనం చేయడం పక్కన బెట్టండి. అడ్డంగా బుక్కవుతాం. దొరికితే దొంగ లేకపోతే దొర అని అందుకే మన పెద్దలు అంటుంటారు. సరే.. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే.. థాయిలాండ్‌లోని ఓ జుయెలరీ స్టోర్‌కు ఓ దొంగ వెళ్లాడు. గోల్డ్‌ చైన్ కావాలని స్టోర్ ఓనర్‌ని అడిగాడు. దీంతో స్టోర్ ఓనర్ చైన్లు చూపించాడు.ఓ చైన్‌ను తీసుకొని మెడలో వేసుకున్నాడు ఆ దొంగ. ఇంతలో మనోడి వ్యవహారం చూసిన ఓనర్‌కు అనుమానం వచ్చి రిమోట్ కంట్రోల్‌తో డోర్లు లాక్ చేశాడు. ఆ విషయం ఆ దొంగకు తెలియదు కదా. ఇక కాసేపు అటూ ఇటూ తిరిగి.. తెగ బిల్డప్పులు ఇచ్చి ఒక్కసారిగా స్టోర్ నుంచి పరిగెత్తబోయాడు. డోర్‌ను ఓపెన్ చేయబోయాడు. కానీ.. ఆ డోర్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏం చేయలేక ఆ ఓనర్ దగ్గరికి వచ్చి ఆ చైన్‌ను తిరిగి ఇచ్చేశాడు. ఇంతలోనే ఆ స్టోర్ ఓనర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో థాయిలాండ్ సోషల్ మీడియాలో షేర్ అవడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

4299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles