రోడ్డుపై ముద్దు పెట్టుకున్నారని అరెస్ట్!

Mon,August 13, 2018 02:55 PM

Young Couple in Pakistan arrested after kissing and cuddling in public

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఓ యువ జంట కారులో కూర్చొని ముద్దు పెట్టుకోవడంతోపాటు చాలా సన్నిహితంగా కనిపించడంతో వాళ్లను అరెస్ట్ చేశారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న ఈ యువ జంట రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించారన్న కేసు పెట్టారు. దీని కింద ఆ జంటకు మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇస్లామాబాద్ సిటీ సెంటర్ దగ్గర కారులో ఈ ఇద్దరూ పబ్లిగ్గా ముద్దు పెట్టుకుంటూ సన్నిహితంగా కనిపించారని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లగా వాళ్లు ఇంకా అలాగే ముద్దు పెట్టుకుంటూ కనిపించారని కేసును విచారిస్తున్న పోలీస్ అధికారి జుల్పికర్ అహ్మద్ చెప్పారు. దీంతో పోలీసులు వాళ్లను ఇస్లామాబాద్‌లోని కరాచీ కంపెనీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌పై వాళ్లను వదిలేశారు. అయితే ఇలా పార్కుల్లో, షాపింగ్ మాల్స్‌లో దొరికిన యువ జంటలను ఇస్లామాబాద్ పోలీసులు గతంలో చాలాసార్లు వేధించిన దాఖలాలు ఉన్నాయి. ఇలా వేధించిన ఎంతో మంది పోలీసులపై చర్యలు కూడా తీసుకున్నారు.

5059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles