చేతులు కలిపిన అమెరికా, చైనా.. వాణిజ్య యుద్ధానికి తెర!

Sun,December 2, 2018 12:14 PM

Xi Jinping and Donald Trump agree on trade war truce during G20 Summit

బ్యూనస్ ఎయిర్స్: అమెరికా, చైనాల మధ్య కొన్ని రోజులుగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరుగుతున్న జీ20 సమావేశాల సందర్భంగా ఈ రెండు అగ్రరాజ్యాల అధినేతలు డిన్నర్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనవరి 1 నుంచి కొత్తగా ఎలాంటి దిగుమతి సుంకాలు విధించకూడదని రెండు దేశాలు నిర్ణయించాయి. చైనా అధికారిక పత్రిక, చానెల్ ఈ విషయాన్ని వెల్లడించాయి. కొత్తగా చైనా వస్తువులపై అమెరికా 20 వేల కోట్ల డాలర్ల మేర సుంకాలు విధించడానికి సిద్ధమవుతున్న తరుణంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం.

అటు అమెరికా మాత్రం వీళ్ల సమావేశ వివరాలను ఇంకా బయట పెట్టలేదు. అయితే భేటీ మాత్రం సానుకూలంగా జరిగినట్లు ట్రంప్ అడ్వైజర్ లారీ కుడ్‌లో వెల్లడించారు. ఈ రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. చైనా, అమెరికాలకు మంచి జరిగే నిర్ణయం ఎప్పుడోసారి తీసుకుంటాం. మా మధ్య బంధం ప్రత్యేకం అని ట్రంప్ చెప్పారు. మా రెండు దేశాల మధ్య సహకారంతోనే ప్రపంచ సౌభాగ్యం, శాంతి చేకూరుతాయని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అన్నారు.

1956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles