వావ్.. ఢిల్లీ నుంచి అమెరికాకు టికెట్ 13500 మాత్రమే!

Wed,May 16, 2018 05:39 PM

WOW air offering New Delhi to America ticket at just 13499

న్యూఢిల్లీ: ఐస్‌లాండ్‌కు చెందిన వావ్ ఎయిర్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ 7 నుంచి ఇండియాలో తమ ఆపరేషన్స్ మొదలుపెడతామని వెల్లడించింది. న్యూఢిల్లీ, కెఫ్లావిక్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉత్తర అమెరికాలోని వివిధ గమ్యస్థానాలకు కేవలం రూ.13499 (పన్నులతో కలిపి)లకే టికెట్ ధరలు ప్రారంభమవుతాయని ఈ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి కెఫ్లావిక్ ఎయిర్‌పోర్ట్‌కు వారానికి ఐదు విమాన సర్వీసులు ఉంటాయని వావ్ ఎయిర్ తెలిపింది. ఢిల్లీ నుంచి వయా కెఫ్లావిక్ ఎయిర్‌పోర్ట్ ఉత్తర అమెరికా వెళ్లే విమానాల్లో 90 శాతం సామర్థ్యం వినియోగం అయ్యేలా చూడాలన్నదే తమ లక్ష్యమని వావ్ ఎయిర్ చీఫ్ స్కులి మోగెన్‌సేన్ అన్నారు.

ఇండియాలో ఢిల్లీతోపాటు కొన్ని ఇతర గమ్యస్థానాలు కూడా లాభదాయకంగా ఉంటాయని తాము గుర్తించినట్లు చెప్పారు. వావ్ ఎయిర్ నాలుగు కేటగిరీల్లో ధరలను నిర్ణయించింది. వావ్ బేసిక్, వావ్ ప్లస్, వావ్ కాంఫి, వావ్ ప్రీమియం కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుంచి ఐస్‌లాండ్, యూఎస్, కెనడా, లండన్‌లకు ఎకానమీ కేటగిరీలో వావ్ బేసిక్ ధర రూ.13499 నుంచి ప్రారంభమవుతాయి. ఇక బిజినెస్ క్లాస్‌లో వావ్ ప్రీమియం ధరలు రూ.46599 నుంచి అందుబాటులో ఉంటాయి.

4852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS