ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పెయింటింగ్ ఇది!

Thu,November 8, 2018 06:45 PM

Worlds Oldest Painting Discovered in Cave in Borneo

మెల్‌బోర్న్: పెయింటింగ్ అనగానే మనకు పికాసో, మైకెలేంజిలో, మోనెట్‌లాంటి వాళ్ల పేర్లు వెంటనే గుర్తొస్తాయి. అయితే ప్రపంచంలో తొలి పెయింటింగ్ ఎవరు వేశారన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా కొందరు పురాతత్వవేత్తలు బోర్నియోలోని గుహల్లో ఉన్న పెయింటింగ్స్‌ను విశ్లేషించి ఇవి 40 వేల ఏళ్ల కిందటివి అని తేల్చారు. ఈ కేవ్ పెయింటింగ్స్‌ను 1994లోనే గుర్తించారు. ప్రపంచంలో తొలి పెయింటింగ్ ఇదేనని వాళ్లు చెబుతున్నారు. ఆ పెయింటింగ్‌ను చూడటం చాలా అద్భుతంగా అనిపించింది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన పెయింటింగ్ ఇదే అని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మాగ్జిమ్ ఆబెర్ట్ చెప్పారు. ఆ దీవిలో ఇప్పటికీ సంచరిస్తున్న ఓ అడవి జంతువు చిత్రం ఆ గుహలో కనిపిస్తుంది. ఈ గుహ పేరు లుబాంగ్ జెరిజి సలా. ఇండోనేషియా దీవి బోర్నియోలోని ఈస్ట్ కాలిమంతన్ ప్రావిన్స్‌లో ఈ గుహ ఉంది. పురాతన రాతి కళకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడి గుహల్లో వేల కొద్దీ పెయింటింగ్స్ ఉన్నాయి.

2854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles