ప్రపంచ పొడవైన నూడుల్ చూశారా..?వీడియోFri,December 15, 2017 03:20 PM
ప్రపంచ పొడవైన నూడుల్ చూశారా..?వీడియో

నూడుల్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు చైనా. చైనీయులు విభిన్నరకాల నూడుల్స్ వంటకాలను ఆరగిస్తుంటారు. తాజాగా ప్రపంచంలోనే అతి పొడవైన నూడుల్ తయారుచేశారు చైనావాసులు. 10,100 అడుగులు పొడువున్న అతిపెద్ద నూడుల్‌ను సిద్ధం చేసి గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఇంత పెద్ద నూడుల్‌ను తయారు చేసింది మెషిన్ అనుకుంటున్నారా..? కాదు. 400 మంది కలిసి 17 గంటలపాటు శ్రమించి ఈ భారీ నూడుల్‌ను తయారుచేశారు. 40 కిలోల బ్రెడ్ ఫ్లేవర్, 26.8 లీటర్ల నీరు, 0.6 కిలోగ్రాముల ఉప్పుతో పొడవైన నూడుల్‌ను రెడీ చేశారు. ఈ నూడుల్ బరువు 66 కిలోలు. ‘సీనియర్స్ డే’సందర్భంగా చైనీస్ ఫుడ్ కంపెనీ ఈ రికార్డును నెలకొల్పింది. 2001లో జపాన్‌లో 1,800 అడుగుల పొడవు నూడుల్ పేరుతో ఉన్న రికార్డును తాజా రికార్డు బ్రేక్ చేసింది.

1377
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS