ప్రపంచంలోనే అత్యంత అందమైన కుక్క చనిపోయింది..

Sun,January 20, 2019 12:03 PM

ప్రపంచంలోనే అత్యంత అందమైన కుక్క ఇది. మీరు పైన చూస్తున్న ఫోటోలోని కుక్క అదే. దాని పేరు బూ. పొమరేనియన్ జాతికి చెందిన కుక్క అది. అది సాధారణ కుక్క అయితే.. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకునేవాళ్లమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత అందమైన కుక్క మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో స్టార్. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో బూ పేరు తెలియని వాళ్లు ఉండరు. ఫేస్‌బుక్‌లో దానికి 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటీ 60 లక్షల మంది అన్నమాట. దాని పేరు మీద ఉన్న ఫేస్‌బుక్ పేజీని ఫేస్‌బుక్ వెరిఫై కూడా చేసింది అంటే అర్థం చేసుకోండి.. ఆ కుక్కకు ఎంత పాపులారిటీ ఉందో.

అయితే.. తనకు ఉన్న కోటీ 60 లక్షల మందిని బాధలో ముంచెత్తి అందనంత దూరం వెళ్లిపోయింది ఆ కుక్క. గుండెకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్న బూ చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందింది. దానికి 12 సంవత్సరాలు. గత సంవత్సరం దాని ఫ్రెండ్ బడ్డీ చనిపోయిందట. అది కూడా సోషల్ మీడియా స్టారే. ఎక్కిడికెళ్లినా ఈ రెండు కలిసే వెళ్లేవట. అది చనిపోగానే.. బూ కు దిగులు పట్టుకున్నదట. అలాగే కుంగిపోయిన బూ.. చివరకు గుండె సమస్యలతో తుది శ్వాస విడిచింది అంటూ బూ యజమాని ఫేస్‌బుక్ పోస్టులో తెలిపాడు. వరల్డ్ క్యూటెస్ట్ డాగ్ అంటూ ముద్దుగా పిలుచుకునే బూ సోషల్ మీడియా స్టార్ మాత్రమే కాదు.. 2012లో దీన్ని వర్జిన్ అమెరికా అఫిషియల్ పెట్ అధికారిగా నియమించారట. 2011లో బూ.. ది లైఫ్ ఆఫ్ ది వరల్డ్ క్యూటెస్ట్ డాగ్ పేరుతో బూ ఫోటోలతో బుక్‌ను ప్రచురించారు.

5425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles