నేపాల్‌: భారతీయ కార్మికులకు వర్క్‌ పర్మిట్‌ తప్పనిసరి

Wed,February 6, 2019 03:04 PM

Work permit mandatory for Indian workers in Nepal

ఖాట్మండు: భారతీయ కార్మికులకు వర్క్‌ పర్మిట్‌ తప్పనిసరి చేస్తూ నేపాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేందుకు వెళ్లే కార్మికులకు ఈ అనుమతులను తప్పనిసరి చేసింది. నేపాల్‌ ప్రభుత్వ కార్మిక, వృత్తి భద్రత విభాగం దేశ వ్యాప్తంగా ఉన్న లేబర్‌ కార్యాలయాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల వాస్తవ సంఖ్యను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఈ గణనలో వర్క్‌ పర్మిట్‌ లేకుండా భారతీయులు సంస్థల్లో పనిచేస్తుంటే సంబంధిత సంస్థకు తెలియజేసి వారిని అనుమతులు తీసుకోవాల్సిందిగా చెప్పాలన్నారు. ఇరు దేశాల సంబంధాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఇటువంటి నియమాలు ఏవీ అమల్లో లేవు. దేశ సరిహద్దు రక్షణలో భాగంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. గత నెలలో నేపాల్‌ రాష్ట్ర బ్యాంకు భారతీయ కరెన్సీ రూ. 200, రూ. 500, రూ. 2000 నోట్లను రద్దు చేసింది.

895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles