కరిచిన పామును చేతికి చుట్టుకొని ఏం చేసిందో తెలుసా?

Wed,August 1, 2018 07:01 PM

Woman wraps snake around wrist which bit her and goes to hospital

ఎవరైనా పాము కరిస్తే ఏం చేస్తారు. వెంటనే పాము కరిచిన వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. చికిత్స చేయిస్తారు. ఇంతలో ఒకవేళ ఆ పాము దొరికితే దాని పని పడతారు. లేదంటే లైట్ తీసుకుంటారు. కాని... ఓ మహిళ మాత్రం అస్సలు లైట్ తీసుకోలేదు. తనను కరిచిన పామును చేతికి చుట్టేసుకుంది. అలాగే దాన్ని పట్టుకొని హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో పామును చేతికి చుట్టుకొని వచ్చిన ఆ మహిళను చూసి హాస్పిటల్ సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.ఈ ఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. సుమారు 1.5 మీటర్ల పొడవు ఉన్న ఆ పాము విషపూరితమైనది కాదట. అందుకే తనను ఆ పాము కరిచినా ఆ మహిళకు ఏం కాలేదు. ఇక.. హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ రూం ముందు ఆ మహిళ చేతికి చుట్టుకొని ఉన్న పాముతో వేచి ఉన్న వీడియో, ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తర్వాత ఆ పామును ఓ బాటిల్‌లో వేసి చికిత్స చేసుకొని ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

12105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles