బతికున్న ఆక్టోపస్‌ను తినబోయిన యువతి.. చివరకు ఏమైందో ఈ వీడియోలో చూడండి

Thu,May 9, 2019 07:38 PM

ఆక్టోపస్ తెలుసు కదా.. ఎనిమిది కాళ్లు ఉంటాయి దానికి. ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో ఈ ఆక్టోపస్‌లే ఎవరు గెలుస్తారో అంచనా వేస్తాయి. ఆ సమయంలో వాటికి భలే డిమాండ్. సరే.. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. ఓ యువతి.. బ్లాగర్. మొబైల్ వీడియో యాప్స్ ఉంటాయి కదా.. వాటిలో ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. మామూలు వీడియోలు చేస్తుంటే ఎవరూ ఫాలోవర్స్ పెరగడం లేదని.. ఏం చేసిందో తెలుసా? ఏకంగా బతికున్న ఆక్టోపస్‌ను లైవ్‌లో తినేయాలనుకున్నది.


కానీ.. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే.. అని నిత్యా మీనన్ పాట పాడినట్టుగా.. ఆ ఆక్టోపస్‌ను తినేయబోయిన యువతిపైనే ఆ ఆక్టోపస్ దాడి చేసింది. తన చెంపను పట్టేసుకుంది. అంతే.. ఆ యువతి గిలగిల్లాడింది. తట్టుకోలేకపోయింది. దాన్ని లాగడానికి విపరీతంగా ప్రయత్నించింది. చివరకు ఎలాగోలా దాన్ని లాగేసింది కానీ.. తన చెంప మాత్రం ఎర్రగా కందిపోయింది. రక్తం కూడా వచ్చింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

7816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles