కర్మఫలం అంటే ఇదేనేమో.. అడ్డంగా దొరికిపోయింది!

Fri,November 23, 2018 05:35 PM

Woman Steals Package, Finds It Full Of Super worms

అబ్బ.. ఇవాళ నా లక్కు సూపర్ అనుకుంది. ఓ ఇంటి డోర్ ముందు ఉన్న ఓ బాక్స్‌ను దొంగలించింది. ఇక.. తన పంట పండిందనుకుంది. కానీ.. ఏమైంది.. చివరకు అడ్డంగా దొరికిపోయింది. మింగలేక.. కక్కలేక అన్నట్టుగా తయారైంది తన పరిస్థితి. ఇక.. జన్మలో దొంగతనం చేయనురా బాబోయ్.. అంటూ రెండు చెంపలు వాయించుకున్నది ఆ మహిళ. ఇంతకీ.. ఆ మహిళ అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నదంటారు.. అంటారా? అయితే.. మనం ఆమె చేసిన చిలిపి పని గురించి చెప్పుకోవాల్సిందే. ఆమెనే అడుగుదాం ఏం చేసిందో..

ఏం చేశారండీ మీరు..
మాది యూఎస్‌లోని ఫ్లొరిడాలో ఉన్న అపొప్క. రోడ్డు మీద వెళ్తుంటే... ఓ ఇంటి డోర్ ముందు ఓ బాక్స్ కనిపించింది. దాంట్లో ఏమున్నాయోననుకొని.. వాటిని కొట్టేద్దామనుకున్నా. అందుకే.. ఆ బాక్స్‌ను ఎవరూ లేనిది చూసి కొట్టేశా. కానీ.. దాన్ని తెరిచి చూసి షాకయ్యా. ఎందుకంటే అందులో అన్నీ సూపర్ వార్మ్స్ ఉన్నాయి. ఈ సూపర్ వార్మ్స్ ఏంది అని టెన్షన్ పడకండి. అవో రకమైన పురుగులు. వాళ్లు ఆర్డర్ చేసుకున్నట్టున్నారు కానీ.. నేను దొంగ బుద్ధితో వాటిని దొంగలించాను. వాటిని నేనేంచేసుకోవాలి. అందుకే.. ఆ బాక్స్‌ను కారులో తీసుకెళ్లి పడేసి వచ్చా.. అంటూ కన్నీళ్ల పర్యంతం అయింది ఆ మహిళ.

కట్ చేస్తే.. ఆమె పడేస్తున్న ఆ ప్యాకేజీని చూసిన మరో వ్యక్తి దాన్ని తీసుకెళ్లి అసలు ఓనర్ షెల్లీ డ్రేవ్స్ ఇంట్లో ఇచ్చేశాడట. ఈ విషయం తెలుసుకున్న డ్రేవ్స్.. వెంటనే సీసీటీవీ కెమెరాను పరిశీలించిందట. అందులో ఆ మహిళ ఆ బాక్స్‌ను దొంగలిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసిన షెల్లీ ఫేస్‌బుక్‌లో ఆ ఫోటోలతో ఓ పోస్ట్‌ను పెట్టింది. ఆ పురుగులను తన కొడుకు ఆర్డర్ చేశాడట. తన కొడుకు ఓ బేర్డెడ్ డ్రాగన్‌ను పెంచుకుంటున్నాడట. తొండలాగా ఉండే ఓ జీవి అది. యూఎస్‌లో వాటిని పెట్స్‌గా పెంచుకుంటుంటారు. దాని కోసమే ఆ పురుగులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారట. ఆ బాక్స్‌లో 500 దాకా పురుగులు ఉన్నాయట. ఇవన్నీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించింది షెల్లీ.

8177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles