మతిమరుపుతో మళ్లీ పెళ్లి చేసుకున్నారు..

Wed,August 21, 2019 08:08 PM

Woman remarries her husband who suffers with dementia


అతని పేరు బిల్..ఆయన భార్య పేరు అన్నే డంకన్ (స్కాట్లాండ్ ). బిల్ కు డిమెన్షియా (మతిమరపు వ్యాధి). మతిమరపు వ్యాధి వీళ్లిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకునేలా చేసింది. అవును వినడానికి కాస్త కొత్తగా, వింతగా ఉన్నా ఇది నిజం. బిల్, అన్నే డంకన్ కు 12 ఏళ్ల కిత్రం పెళ్లయింది. వీరిద్దరికి ఆండ్రియా అనే కూతురు ఉంది. మూడేళ్ల తర్వాత బిల్ కు డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఉంటున్నా బిల్ మాత్రం తన భార్యను గుర్తించలేకపోయాడు. భర్త బిల్ తన కళ్ల ముందే తిరుగుతూ తనని గుర్తు పట్టకపోవడంతో డంకన్ కు బాధపడుతూ ఉండేది. అయితే ఓ రోజు బిల్ తన భార్య అన్నే దగ్గరకు వచ్చాడు. నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా..జీవితాంతం నీతోనే ఉండిపోతానంటూ అన్నే డంకన్ ను బిల్ ప్రపోజ్ చేశాడు. బిల్ ఆ విషయం మర్చిపోతాడనుకుంది. కానీ బిల్ మాత్రం మరోసారి అన్నే దగ్గరకు వచ్చి పెళ్లి విషయమై అడిగాడు.


తన భర్త గతమంతా మర్చిపోయి మళ్లీ ప్రెష్ గా తన దగ్గరకు వచ్చి ప్రేమిస్తున్నా. పెళ్లిచేసుకుంటావా అని అడిగేసరికి అన్నే డంకన్ ఎగిరిగంతేసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కూతురు ఆండ్రియాకు ఫోన్ చేసి పెళ్లి కూతురు గౌను ఆర్డర్ చేసింది. కేఫ్ నుంచి కేకులు కూడా తెప్పించింది. మరుసటి రోజు సాయంత్రమే తమ ఇంటి ప్రాంగణంలో ఉన్న గార్డెన్ లో ఒకరికొకరు పుష్పగుచ్చాలు ఇచ్చుకుని మరోసారి వివాహబంధంతో ఒక్కటయ్యారు. గతాన్ని మర్చిపోయిన తన భర్త మళ్లీ యువకుడిలా తన దగ్గరికొచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత ఇలా పెళ్లి చేసుకోవడం వల్ల కలిగిన సంతోషాన్ని ఫేస్ బుక్ ద్వారా తన స్నేహితులతో పంచుకుంది.

ఈ పెళ్లిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.. ఏం ప్రేమకథ..అందమైన ప్రేమకథ..ఎంత అందమైన ప్రేమకథ, హృదయానికి హత్తుకునేలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

8712
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles