తృటిలో చావు తప్పింది.. వీడియోSat,December 9, 2017 03:33 PM
తృటిలో చావు తప్పింది.. వీడియో

ఈవిడ ఏ జన్మలోనూ పుణ్యం చేసుకొని ఉండి ఉండొచ్చు. ఆమె అదృష్టం బాగా ఉండటంతో తృటిలో చావు తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో ఆవిడ ప్రాణాలతో బయటపడింది. చైనాలోని ఓ రోడ్డు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే ఓ మహిళ రోడ్డు దాటుతుండగా.. ఒక వాహనం అతివేగంతో దూసుకువచ్చింది. ఆవిడ కాళ్లు.. ట్రక్కు ముందు టైర్లకు తగిలాయి. దీంతో 180 డిగ్రీల కోణంలో తిరిగిన ఆ మహిళ తల వెనుక టైర్ల కింద పడింది. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేశాడు. సరిగ్గా ఆమె తలకు ఇంచు దూరంలో వాహనం ఆగిపోయింది. అనంతరం డ్రైవర్ వాహనం దిగేసి.. ఆవిడ వద్దకు చేరుకుని ట్రక్కు కిందిభాగం నుంచి ఆమెను బయటకు లాగేశాడు. ఆ మహిళకు పెద్దగా గాయాలు కాకపోవడంతో డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నాడు.

3889
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS