బాయ్‌ఫ్రెండ్‌ను చంపి.. ముక్కలు చేసి వండి..!

Thu,November 22, 2018 01:59 PM

Woman in Abudhabi killed her Ex Boyfriend and cooked with his remains

అబుధాబి: వింటేనే వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. అబుధాబిలో ఓ మహిళ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చంపి, అతన్ని ముక్కలుగా చేసింది. ఆ తర్వాత వాటితో ఓ మొరక్కన్ వంటకం వండి అక్కడున్న నిర్మాణ కార్మికులకు వడ్డించింది. యూఏఈలోని అల్ ఐన్ పట్టణంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. 30 ఏళ్ల సదరు మహిళ తన నేరాన్ని అంగీకరించింది. తనను వాడుకొని వదిలేశాడని పగ పెంచుకున్న సదరు మహిళ.. బోయ్‌ఫ్రెండ్‌పై పగ తీర్చుకోవాలని భావించినట్లు ఖలీజ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అందులో భాగంగా అతన్ని చంపినట్లు ఆమె విచారణలో అంగీకరించింది.

ఈ ఘటన కొన్ని నెలల కిందటే జరిగినా.. ఈ మధ్యే హతుని సోదరుడు అతన్ని వెతుక్కుంటే వాళ్ల ఇంటికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. తన సోదరుని గురించి సదరు మహిళను ఆరా తీయగా.. తనకు తెలియదని, అతనికి వేరే మహిళతో సంబంధం ఉన్న కారణంగా విడిపోయినట్లు ఆమె చెప్పింది. అయితే ఆమె ఇంట్లో ఉన్న బ్లెండర్‌లో ఓ మనిషి దంతం కనిపించడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా.. అసలు విషయమంతా బయటపడింది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

3725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles