చికెన్ షావర్మ తినిపించలేదని విడాకులిచ్చింది..!Wed,February 21, 2018 04:22 PM

చికెన్ షావర్మ తినిపించలేదని విడాకులిచ్చింది..!

భార్యాభర్తల బంధం అనేది చాలా గట్టిది.. గొప్పది.. అని ఇంకా ఏవేవో చెబుతుంటారు పెద్దలు. కాని.. అది ఎంత బలహీనమే ఈ ఘటనే చెబుతున్నది. కేవలం చికెన్ షావర్మ తినిపించలేదన్న కారణంతో తన భర్తకు విడాకులిచ్చింది ఓ భార్య. ఈ ఘటన అరబ్ దేశంలో జరిగింది. అది కూడా పెండ్లయిన 40 రోజులకే... ఈ కారణంతో భర్తకు విడాకులిచ్చి ఇప్పుడు వార్తల్లోకెక్కింది.

ఓ జంట ఓ రోజు సాయంత్రం సరదాగా అలా బయటకు వెళ్లింది. అయితే.. భార్య.. చికెన్ షావర్మ కావాలని భర్తను అడిగింది. అయితే.. భర్త షావర్మ బదులు జ్యూస్ కొనిచ్చాడట. అంతే కాదు.. ఇక ఈ జ్యూసే లాస్ట్.. నా డబ్బులనంతా తగలెట్టేస్తున్నావు అంటూ తన భార్య మీద అరిచాడట. దీంతో వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. అంతే కాదు.. పెండ్లి అయినప్పటినుంచీ వాళ్లిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలేనట. భర్త పిసినారి కావడంతో ఎప్పుడూ వాళ్లు పోట్లాడుకుంటూనే ఉండేవాళ్లు. ఆ గొడవ కాస్త ఆరోజు పెరిగి పెద్దదయింది. దీంతో ఆ మహిళ భర్తకు విడాకులిచ్చేసినట్లు ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది.

"మాకు సంప్రదాయంగా పెండ్లి జరిగింది. మాది అరేంజ్‌డ్ మ్యారేజే. పెండ్లికి ఓ రెండు నెలల ముందే అతడు నాకు తెలుసు. కాని.. అతడు చాలా పిసినారి. డబ్బులు అస్సలు ఖర్చు పెట్టడు. పెండ్లి అయిన కొత్తలోనే తనకు బయటికి వెళ్లడం అంటే అస్సలు నచ్చదు అని అనేవాడు. బయటికి వెళ్తే డబ్బులు ఖర్చవుతాయి కదా. కాని.. అతడి పిసినారితనం రోజు రోజుకు ఎక్కువైంది. అందుకే ఇక నావల్ల కాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను." అని ఆ మహిళ తెలిపింది.

4065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS