కారులో సాలీడు కనిపించిందని ఈ మహిళ ఏం చేసిందంటే?

Fri,April 12, 2019 04:51 PM

Woman Crashes Car After Spotting Spider in car

సాలీడును చూసి మీరు భయపడతారా? ఎహె.. ఊరుకోండి. సాలీడును చూసి కూడాఎవరైనా భయపడతారా? అదేమన్నా పామా? తేలా? భయపడటానికి. అది మనుషులను ఏం చేయదు కదా అంటారు కదా. మరి.. న్యూయార్క్‌లోని ఓ మహిళ మాత్రం కారులో స్పైడర్ కనిపించిందని ఏకంగా కారును రాయికి ఢీకొట్టింది. ఇంకేముంది కారు ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయింది. స్పైడర్‌ను చూసి భయపడినందుకు ఆ మహిళ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అంతేనా.. తన కాలు కూడా విరిగిపోయింది. సాలీడును చూడగానే కారు కంట్రోల్ తప్పిందట. అంతే.. ఫలితం ఊహించకుండా అయిపోయింది.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళకు అరాక్నోఫోబియా ఉన్నట్లు తేల్చారు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు సాలీడును చూడగానే వణికిపోతారు. భయపడిపోతారు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. నిజానికి కారులో ఆమెకు కనిపించింది చిన్న సాలీడేనట. కానీ.. ఆ డ్రైవింగ్ చేస్తుండగా.. సడెన్‌గా ఆ సాలీడును చూసి భయానికి గురవడంతో కారు కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయిందని పోలీసులు తెలిపారు.

అయితే.. సాలీడు వల్ల ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారేమీ కాదు.. గత సంవత్సరం అంటే 2018 లో ఇలాగే తమ ఇంట్లో ఉన్న సాలీడులను వెళ్లగొట్టడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు తమ ఇళ్లనే తగులబెట్టుకున్నారు.

2385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles