త‌న‌ పెట్ క్యాట్‌ను మింగిన‌ కొండచిలువను ఏంచేసిందంటే.. వీడియో

Wed,March 14, 2018 02:02 PM

Woman captured massive python after it swallowed family cat in Australia

ఎవరైనా పాము ఇంటికొస్తే ఏం చేస్తారు. దాన్ని చంపడానికి ప్రయత్నించడమో.. లేదంటే ఎవరైనా పాములను పట్టేవాళ్లను పిలిచి దాన్ని బంధించడమో చేస్తారు. కాని.. ఈ మహిళ కాస్త డిఫరెంట్. తన ఇంట్లోకి దూరి.. తను పెంచుకున్న పిల్లిని లటక్కున మింగేసిన కొండ చిలువను ఏం చేసిందో తెలుసుకుందాం పదండి...

అది ఆస్ట్రేలియా. కొండ చిలువ ఓ ఇంట్లో దూరింది. ఇంట్లో ఉన్న పిల్లిని లటక్కున మింగేసింది. ఒకేసారి కొండచిలువను మింగేసరికి దానికి కాస్త ఆయాసంగా అనిపించి అక్కడే రెస్ట్ తీసుకుందామనుకున్నది. కాని.. అంతలోనే ఆ పిల్లి ఓనర్ కొండ చిలువను గమనించింది. నేను పెంచుకునే పిల్లినే తినేస్తావా అని కోపంతో కొండచిలువను పట్టుకొని బయటకు లాగి... చేతులతో పట్టుకొని కారులో వేసి బంధించింది. తర్వాత దాన్ని ఏం చేసిందనే విషయం తెలియనప్పటికీ.. ఆ మహిళ ఎంతో దైర్యంతో.. ఏమాత్రం బెదరకుండా ఆ కొండచిలువను మేనేజ్ చేసిన విధానం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ మహిళ కొండచిలువను పట్టుకొని బయటికి తీసుకొచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మన ఇంట్లోకి అనుకోకుండా ఏవైనా వస్తే.. వాటికి హాని చేయకుండా వాటిని తీసుకెళ్లి అడవిలో వదిలిరావడమే మనం చేసే మంచి పని. అంతే కాని.. వాటిని చంపాలని ప్రయత్నిస్తే అవి మనకు హాని చేసే అవకాశం ఉంటుంది. అందుకే మన సేఫ్టీ కోసమైనా వాటికి హాని తలపెట్టకుండా వాటిని రక్షించాలి.. అంటూ చెబుతున్నది కొండచిలువను బంధించిన మహిళ. అయితే.. ఆ మహిళ వృత్తిరిత్యా ఎలక్ట్రీషియన్ అయితే.. ప్రవృత్తి రిత్యా.. వన్యప్రాణుల సంరక్షకురాలుగా పని చేస్తున్నదట. అప్పుడే వాటిని మేనేజ్ చేయడం ఎలాగో నేర్చుకున్నదట. అందుకే ఆ కొండచిలువను ఎంతో ఈజీగా మేనేజ్ చేయగలిగింది.

4792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS