కొలంబో: శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే తెలిపారు. ఈస్టర్ వేడుకల సందర్భంగా శ్రీలంక రాజధాని నగరం కొలంబోతో పాటు దేశంలోని పలు ప్రదేశాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 359 మంది మృతిచెందినట్లుగా సమాచారం.