వీడియో: కొంపముంచిన మొబైల్.. ఫోన్ చెక్ చేస్తూ..!Mon,December 11, 2017 05:08 PM

వీడియో: కొంపముంచిన మొబైల్.. ఫోన్ చెక్ చేస్తూ..!

నోమోఫోబియా.. అనే పేరు విన్నారా ఎప్పుడైనా? అసలు వినలేదా. అయితే.. ఈ ప్రపంచంలో ఈ పదం గురించి వినని వాళ్లు ఉంటారేమో కాని.. దీని భారిన పడే వాళ్లు మాత్రం కోకొల్లలు. నోమోఫోబియా అంటే.. సింపుల్‌గా చెప్పాలంటే.. మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోతుందనుకో ఏం చేస్తారు? మీకు అప్పుడు కాళ్లు చేతులు ఆడవు.. వెంటనే చార్జర్ కోసం వెతుకుతారు. చార్జింగ్ అయిపోతున్నదే అనే టెన్షన్‌తో చెమటలు పట్టేస్తాయి..ఒక రకమైన డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఫోన్‌లో సిగ్నల్ లేదు.. ఎంతో టెన్షన్ పడతారు. అయ్యో.. సిగ్నల్ లేదే.. ఏవైనా కాల్స్ వస్తాయేమో అని టెన్షన్ పడతారు. ఇలా.. ఫోన్‌కు ఏదైనా చిన్న డ్యామేజీ అయినా... ఫోన్ కొంచెం సేపు స్విచ్‌ఆప్ అయినా తెగ కంగారు పడిపోయే వాళ్లే ఈ నోమోఫోబియా బాధితులు. ఇప్పుడు గీ సోదంతా ఎందుకు అని దీర్ఘాలు తీయకండి.

ఆ నోమోఫోబియా వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయనడానికి ఈ ఘటన సరైన ఉదాహరణ. అందుకే దాని గురించి వివరించాల్సి వచ్చింది. ఓ మహిళ ఓ మాల్‌కు వెళ్లింది. వెళ్లి ఏదో కొంత షాపింగ్ చేసింది. తర్వాత మాల్‌లో నడుచుకుంటూ వెళ్తున్నది. చేతిలో ఫోన్.. ఫోన్‌లో ఏదో చూస్తూ అలాగే నడుచుకుంటూ వెళ్తున్నది. అలాగే సక్కగ.. పార్కింగ్ రూమ్‌లోకి వెళ్లింది. అది చైనా. అక్కడ పార్కింగ్ అంతా పకడ్బందీగా ఉంటుంది. ఆ పార్కింగ్ రూమ్‌లోకి కారు వెళ్లగానే కారును దానికి ఉండే లిఫ్ట్ ద్వారా కిందికి పంపిస్తారు. మళ్లీ పైకి రావాలనుకుంటే.. అదే లిఫ్ట్‌తో పైకి వస్తుంది. అదంతా ఓ స్టిస్టమాటెడ్ పార్కింగ్ సిస్టమ్. ఇక.. ఆ మహిళ ఆ రూమ్‌లోకి వెళ్లగానే షట్టర్ ఆటోమెటిక్‌గా మూసుకుంది.

అప్పుడు తేరుకున్న ఆమె.. అరెరె.. నేను ఎక్కడ ఉన్నాను అని అటూ ఇటూ తిరిగి చూసింది. అప్పుడు అర్థమయింది తనకు.. పార్కింగ్ ప్లేస్‌లోకి వచ్చానని.. వెంటనే తిరిగి వెళ్దామనుకునే లోపే.. తను నిలుచున్న ఏరియాలో ఉన్న లిఫ్ట్ తనను కిందికి తీసుకెళ్లింది. అక్కడ వెంటనే లిఫ్ట్ మీదికి వస్తున్న కారు తనను ఢీకొంది. దీంతో కారు, గోడ మధ్యలో ఆ మహిళ నలిగిపోయింది. తర్వాత ఆ మహిళను ఆసుపత్రికి తరలించిగా ప్రస్తుతం కోలుకుంటున్నది. చూశారుగా... ఓ ఫోన్.. ఎంత పని చేసిందో.

7105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS