అమెరికాకు చైనా వార్నింగ్!

Fri,September 21, 2018 02:39 PM

withdraw sanctions or bear consequences China warns America

బీజింగ్: అమెరికా, చైనా మధ్య వివాదం ముదురుతున్నది. ఇప్పటికే ఓవైపు వాణిజ్య యుద్ధం జరుగుతున్న సమయంలో తాజాగా చైనా మిలిటరీ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నదనే సదరు సంస్థపై ఆంక్షలు విధించినట్లు అమెరికా వెల్లడించింది. అయితే దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఆంక్షలను తొలగిస్తారా లేక పరిణామాలను ఎదుర్కొంటారా అంటూ అమెరికాను హెచ్చరించింది. అమెరికా ఇలాంటి పనులు చేయడాన్ని చైనా తీవ్రంగా తప్పుబడుతున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. ఇప్పటికే అమెరికాకు చైనా అధికారికంగా నిరసన తెలిపినట్లు గెంగ్ స్పష్టంచేశారు.

అమెరికా చర్యలు అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుంది. అంతేకాదు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది అని గెంగ్ అన్నారు. వెంటనే అమెరికా తాను చేసిన తప్పును సరిదిద్దుకొని ఆ ఆంక్షలను తొలగించకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. చైనా రక్షణ శాఖకు చెందిన ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌పై ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఈ సంస్థ రష్యా నుంచి సుఖోయ్ సు-35 ఫైటర్ జెట్స్, ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను కొనుగోలు చేసింది.

3593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles