కష్టపడి డబ్బు దొంగలిస్తే.. గాలికి ఎగిరిపోయాయి.. వీడియో

Mon,April 16, 2018 05:21 PM

Wind blows away Robber stolen cash in UK

కొంతమంది కష్టపడి డబ్బులు సంపాదిస్తే.. మరి కొంతమంది అంతే కష్టపడి మరీ.. డబ్బును దొంగలిస్తారు. అయితే.. ప్రతి గింజ మీద దాన్ని తినేవాళ్ల పేరు రాసిపెట్టి ఉంటుందన్నట్టు... నోట్ల కట్టల మీద కూడా దాన్ని ఖర్చుపెట్టేవాళ్ల పేర్లు రాసిపెట్టి ఉంటాయ్ కాబోలు. అందుకే.. ఎంతో కష్టపడి డబ్బులు కొట్టేసినా.. వాటిని ఖర్చుపెట్టే భాగ్యం మాత్రం వాళ్లకు దక్కలేదు. క్వైట్ ఇంటరెస్టింగ్ అంటారా? పదండి ఇంకాస్త ముందుకెళ్దాం...

అది యూకేలోని గ్రేటర్ మాంచెస్టర్ పరిధిలోని డ్రోయిల్స్‌డెన్‌లో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ. ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు తిన్నగా ట్రావెల్ ఏజెన్సీలోకి దూరారు. ట్రావెల్ సిబ్బందిని బెదిరించి వాళ్లనుంచి డబ్బులు లాక్కున్నారు. వాటిని ప్యాంట్‌లో పెట్టుకొని బయటికి వచ్చారు. అయితే.. వాళ్లను దురదృష్టం వంద కిలోమీటర్ల స్పీడ్‌తో వెంటాడుతున్నదని తెలుసుకోలేకపోయారు పాపం. వాళ్లు బయటికి రాగానే గాలి బీభత్సం సృష్టించింది. దీంతో ప్యాంట్‌లో దాచిన డబ్బులన్నీ గాలికి ఎగిరి రోడ్డుమీద పడిపోయాయి. డబ్బులన్నీ రోడ్డు మీద పడిపోగానే.. ఓ దొంగ అక్కడి నుంచి తుర్రుమనగా... మరో దొంగ ఆ డబ్బులను ఏరడానికి ప్రయత్నించాడు. అంతలోనే ప్యాంట్‌లో ఉన్న మరికొన్ని నోట్లు గాలికి ఎగిరిపోయాయి. ఇక.. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో ఆ దుండగులను పట్టుకోవడం కోసం పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

5823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles