అభినందన్‌ను రేపు విడుదల చేస్తాం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Thu,February 28, 2019 04:50 PM

ఇస్లామాబాద్: తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన 30 నిమిషాల్లోనే మమ్మల్ని నిందించడం మొదలుపెట్టారు. ఆధారాలు ఇవ్వమని కోరినా ఇవ్వలేదు. ఇండియా ఏదో ఒకటి చేస్తుందని అనుకున్నాం. దాడి చేసిన రెండు రోజుల తర్వాత వాళ్లు ఇవాళ (గురువారం) మాకు పూర్తి సమాచారం ఇచ్చారు. శాంతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ పైలట్‌ను శుక్రవారం విడుదల చేయాలని నిర్ణ‌యించాం అని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

4865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles