ఓహో.. ఇలా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందా?

Fri,October 26, 2018 03:30 PM

What Disrupted Traffic On This Road? A Giant Industrial Spool

ట్రాఫిక్ జామ్ అవ్వాలంటే భారీగా వాహనాలు వెళ్లడమో.. లేదంటే ఆ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరగడమో.. ఎక్కడైనా రోడ్డు బ్లాక్ అవ్వడమోలాంటివి చూస్తుంటాం. కానీ.. యూఎస్‌లోని టెక్సాస్‌లో ఉన్న హౌస్టన్‌లో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఎందుకు జరిగిందో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.

ఎందుకంటే.. ఓ భారీ పైపుల చక్రం వల్ల. అవును.. పారిశ్రమిక కంపెనీల్లో పైపులను చుట్టలా చుడుతారు కదా ఓ చక్రానికి. అదే.. దాన్ని ఓ ట్రక్ తీసుకెళ్తుండగా.. అది ప్రమాదవశాత్తు ట్రక్ నుంచి జారి హైవేపై దూసుకెళ్లింది. ఇక చూసుకోండి.. రోడ్డు మీది వాహనదారులు దాన్ని చూసి భయపడి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వెనుక వచ్చే వాహనాలు.. దాన్ని ముందు వెళ్లే వాహనాలన్నీ పక్కకు తప్పుకోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా వాహనాలతో నిండిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన ఫోటోలను టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పొర్టేషన్ హౌస్టన్ జిల్లా ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. మరో ఫేస్‌బుక్ యూజర్ ఆ స్పూల్ హైవేపై వెళ్తుండగా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.5206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles