వీడియో: ఆకాశంలో వింత వస్తువు.. ఏమై ఉంటుంది..!Fri,November 17, 2017 06:47 PM
వీడియో: ఆకాశంలో వింత వస్తువు.. ఏమై ఉంటుంది..!

అప్పుడప్పుడు ఆకాశంలో విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి వాటి మర్మాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా దొరకదు. ఆకాశంలో అలా కనిపించి కనుమరుగవుతుంటాయి. రీసెంట్‌గా జర్మనీలోనూ ఆకాశంలో ఇలాంటిదే ఓ విచిత్రం జరిగింది. ఓ నక్షత్రంలాగా ఉన్న వస్తువు మెరుస్తూ... రంగులు మారుస్తూ.. ఆకాశంలో స్పీడ్‌గా వెళ్తున్న‌ట్లు క‌నిపించి మాయ‌మైంది.

దానికి సంబంధించిన వీడియోను జర్మనీకి చెందిన ఫైర్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఉన్న ప్రకారం.. అది ఓ ఉల్క అయి ఉంటుందని ఫైర్ డిపార్ట్ మెంట్ పేర్కొన్నప్పటికీ.. అది ఉల్క అనే ఆధారాలు మాత్రం చూపలేకపోయింది.

ఇక.. జర్మన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దీనిపై స్పందించింది. ఇది ఎయిర్‌క్రాఫ్ కాకపోవచ్చు. కాని.. కచ్చితంగా ఏంటనే విషయం మాత్రం చెప్పలేమని తేల్చింది. ఒకవేళ అది ఉల్కాపాతం అయితే కనుక ఇప్పటికే అది ఆకాశంలో ఎక్కడో ఒక చోట పేలిపోవాలి.. కాని.. అటువంటి సంఘటనలేవీ ఆ ప్రాంతంలో చోటు చేసుకోకపోవడంతో.. దానిపై క్లారిటీ రావాల్సి ఉందని డెయిలీ మెయిల్ రిపోర్ట్ చేసింది.

కనీసం మీరైనా ఆ వీడియో చేసి.. అదేంటో ఊహించండి చూద్దాం...4497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS