కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

Fri,May 4, 2018 03:39 PM

Waste landslides kills 14 in mynmar


బ్యాంకాక్ : గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతంలో పైభాగంలో ఉన్న కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. మరికొంతమంది మిస్ అయ్యారు. అదృశ్యమైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఉత్తర మయన్మార్‌లోని జేడ్ మైనింగ్ ప్రాంతంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. జేడ్ మైనింగ్ స్థలంలో ప్రతీ రోజు భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగుతుంటాయి. తవ్వకాల్లో మిగులు మట్టి, రాళ్ల సంబంధిత వ్యర్థాలు పెద్ద మొత్తంలో కుప్పకుప్పలుగా పేరుకుపోతాయి. దీనివల్ల కొంచచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2015లో ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

1557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles