ప్రధాని అభ్యర్థి ఇమ్రాన్‌కు పాక్ క్రికెటర్ల మద్దతు!

Tue,July 24, 2018 07:10 PM

Wasim Akrams support for Imran Khan to Shoaib Akthars tweet, cricketers

ఇస్లామాబాద్: పాకిస్థాన్ భవిష్యత్‌ను నిర్ణయించే సాధారణ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. పాకిస్థాన్ పార్లమెంట్‌కు జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి తాలిబన్లతో పాటు పాక్ ఆర్మీ నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇమ్రాన్ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆదేశ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ సారథ్యంలోని పాక్ 1992 క్రికెట్ వరల్డ్ కప్‌ను సొంతం చేసుకొని ఛాంపియన్‌గా అవతరించింది.

తన పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రాన్‌కు తన సహచర ఆటగాళ్లతో పాటు ప్రస్తుత తరం పాక్ ఆటగాళ్లు అక్రమ్‌కు మద్దతుగా నిలిచారు. జులై 25న జరిగే ఎన్నికల్లో ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. మీ నేతృత్వంలో పాక్ ప్రపంచకప్ టైటిల్ నెగ్గిందని అలాగే మీ పరిపాలనలో పాక్ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్, లెజండరీ పేసర్ వకార్ యూనిస్, స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్, పాక్ మాజీ సారథి మహ్మద్ హఫీజ్, పేసర్ ఉమర్ గుల్ తదితరులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.


1612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles