వీడియో: బెడిసికొట్టిన వ్లోగర్ స్టంట్ షో!

Fri,November 17, 2017 02:44 PM

Vlogger car stunt show goes wrong

ఒక్కోసారి స్టంట్ మెన్స్ చేసే షోలు బెడిసి కొడుతుంటాయి. వాళ్లు ఎంత ప్రాక్టీస్ చేసినా ఒక్కోసారి ఏమరపాటులో స్టంట్స్ మిస్స‌వుతుంటాయి. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ డేర్ డెవిల్ కూడా ఎన్నో స్టంట్స్ చేస్తుంటాడు. ఈయన ఓ వ్లోగర్. అంటే.. స్టంట్ షోల వీడియోలన్నింటినీ సోషల్ మీడియాలో, వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తుంటాడు. పేరు బాగెల్స్. రీసెంట్‌గా కారు స్టంట్ షో చేయబోయాడు. కాని.. ఆ స్టంట్ బెడిసికొట్టింది. కారు స్పీడ్‌గా వెళ్తుండగా.. మనోడు ఆ కారు మీది నుంచి బ్యాక్ సైడ్ ఫ్లిప్ కావాలి. కాని.. అది కాస్త రివర్స్ అయి జస్ట్ మిస్‌లో కారు పక్కన పడిపోయాడు. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. అంతే.. కొద్ది క్షణాల్లోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. అంతే కాదు.. ఇటువంటి స్టంట్స్ ఇంకోసారి చేయకు ప్లీజ్... వీడియో చూస్తుంటేనే భయమేస్తున్నది.. అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

A post shared by Bailey Payne (@bagels_payne) on

3271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles