మళ్లీ దేశాధ్యక్షుడిని నేనే : పుతిన్

Thu,December 7, 2017 09:06 AM

Vladimir Putin to run for re election in 2018

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి దేశాధ్యక్ష బరిలో నిలవనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నట్లు ఆయనే స్పష్టం చేశారు. నిజ్నీ నవ్‌గొరాడ్ నగరంలోని ఓ కారు ఫ్యాక్టరీ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి పుతిన్ ఏదో విధంగా అధికారాన్ని తన చేతిలోనే ఉంచుకున్నారు. దేశాధ్యక్షుడిగా, ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. వచ్చే మార్చిలో జరిగే ఎన్నికల్లో ఒకవేళ పుతిన్ గెలిస్తే, 2024 వరకు మళ్లీ ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. పుతిన్‌కు పోటీగా ఈసారి అధ్యక్ష బరిలో టీవీ జర్నలిస్టు సీనియా సబ్‌చాక్ నిలబడుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ విక్టరీ మాత్రం పుతిన్‌నే వరిస్తుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో నవల్నీని రాజకీయంగా వెలివేశారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పుతిన్ గెలిస్తే, జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాను అత్యధిక కాలం ఏలిన నేతగా ఆయన నిలుస్తారు.

2582
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS