విట‌మిన్ సీతో.. బీపీ, షుగ‌ర్ త‌గ్గుతుంది !

Mon,February 25, 2019 03:15 PM

Vitamin C may lower BP, sugar levels in diabetics

హైద‌రాబాద్: విట‌మిన్ సీ మాత్ర‌ల‌తో.. బీపీ, షుగ‌ర్ లాంటి వ్యాధుల‌ను అదుపు చేయ‌వ‌చ్చ‌ట‌. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. డ‌యాబెటిస్‌, ఒబెసిటీ, మెట‌బాలిజం జ‌ర్న‌ల్‌లో దీనిపై క‌థ‌నం రాశారు. క్ర‌మ‌బ‌ద్దంగా విట‌మ‌న్ సీ స‌ప్లిమెంట్స్ తీసుకుంటే.. షుగ‌ర్ తీవ్ర‌త‌ను త‌గ్గించ‌వ‌చ్చు అని ఆ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు కూడా అధిక ర‌క్త‌పోటును త‌గ్గించ‌వ‌చ్చు అని పేర్కొన్నారు. విట‌మిన్ సీ మాత్ర‌ల వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువేన‌ట‌. విట‌మిన్ సీ ట్యాబ్లెట్లు తీసుకోవ‌డం వ‌ల్ల భోజ‌నం త‌ర్వాత 36 శాతం షుగ‌ర్ స్థాయి ప‌డిపోయిన‌ట్లు గుర్తించారు. హైప‌ర్‌గ్లైకేమియా ప‌రిస్థితి నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌న్నారు. విట‌మిన్ సీ క్యాప్సూల్స్‌తో హైప‌ర్ టెన్ష‌న్ కూడా త‌గ్గుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న సాధార‌ణ స్థాయి కంటే ప‌ది శాతం ఎక్కువ విట‌మిన్ సీ తీసుకుంటే.. వారిలో ఈ మార్పును గ‌మ‌నించ్చవ‌చ్చ‌న్నారు. ఉసిరికాయ లాంటి స‌హ‌జ ఫ‌లాల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.

3222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles