హంతకుని ఆచూకీ చెప్తే 18 లక్షల బహుమానం

Thu,November 8, 2018 04:32 PM

virginia police announce 25k dollar reward for information on mystereous case

అమెరికాకు ఓ హత్యకేసు ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది. ఏమీచేయలేక పోలీసులు భారీగా పారీతోషికం ప్రకటించారు. హంతకుని ఆచూకీ చెప్పినవారికి 25 వేల డాలర్ల బహుమానం ఇస్తామని (భారతీయ కరెన్సీలో 18 లక్షలు) చెప్పారు. జొహాన్ డిలీడ్ తన 83వ యేట వర్జీనియా పేర్‌ఫాక్స్ కౌంటీలోని స్వగృహంలో రాత్రి 1 గంట ప్రాంతంలో టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి పారిపోయాడు. డిలీడ్ కుర్చీలోనే కన్నుమూశారు. కుఉటంబ సభ్యులు టీవీలో కాల్పులని అనుకున్నారట. తీరా వచ్చి చూస్తే డిలీడ్ విగతజీవిగా కనిపించాడు. ఆయన సామాన్య పౌరుడు కాదు. ప్రపంచబ్యాంకు తలపండిన ఆర్థికవేత్త. 20 ఏళ్ల క్రితం రిటైరయ్యారు. హాయిగా ప్రశాంత జీవనం సాగిస్తున్నారు.

తోటపని, ఇంటిదగ్గరున్న పొటోమాక్ నదిలో బోటుషికారు ఇవి ఆయన నిత్యకృత్యాలు. హత్య జరిగింది 2016 మార్చి 11న. అంటే రెండున్నరేళ్లు దాటింది. బోలెడు మంది డిటెక్టివ్‌లు తల బద్దలు కొట్టుకున్నారు. కానీ హంతకుని ఆచూకీ తెలియలేదు. హత్యకు కారణాలు గానీ, అనుమానితులను గానీ గుర్తించలేకపోయామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఇప్పటిదాకా అరెస్టులు కూడా లేవు. అసలు ఎలాంటి ఆధారాలూ దొరుకకపోవడం విచిత్రమని, ఇది ఓ అసాధారణమైన, అరుదైన కేసు అని ఫేర్‌ఫాక్స్ కౌంటీ డిటెక్టివ్ జాన్ విక్కరీ అన్నారు. హత్య తర్వాత ఓ నల్లని పోర్డు వ్యాను డిలీడ్ ఇంటివద్ద నుంచి వెళ్లిపోవడం చూశామని కొందరు చెప్పారు. ఎవరికి మాత్రం అతనిని చంపాలని ఉంటుంది.. మా జీవితాలు మాత్రం హత్య వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి.. అని డిలీడ్ కోడలు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. పోలీసులు, కుటుంబ సభ్యులు ఇప్పుడు రివార్డుతో అయినా కొంత ఫలితం ఉంటుందేమోనని ఆశిస్తున్నారు.

2277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles