వీడియో: ఆన్‌లైన్ వేధింపులు నిజ జీవితంలోకి వ‌స్తే..?Wed,October 11, 2017 01:03 PM
వీడియో: ఆన్‌లైన్ వేధింపులు నిజ జీవితంలోకి వ‌స్తే..?

మోనిక లెవిన్సీ.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ప్రియురాలు. ఆయనతో ఉన్న అఫైర్‌కు తనను ఆన్‌లైన్‌లో నెటిజన్లు మామూలుగా ట్రోల్ చేయలేదు. సైబర్ బుల్లింగ్‌లో మొదటి బాధితురాలిని కూడా తానే అంటూ మోనిక చెబుతుంటుంది. అయితే.. రోజు రోజుకు పెరుగుతున్న ఆన్‌లైన్ బుల్లింగ్ నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందని తను ఆలోచించింది. అందుకే ఓ సోషల్ ఎక్స్‌పరిమెంట్ చేసింది తను. కొంతమందితో కలిసి నిజ జీవితంలో వ్యక్తులను డైరెక్ట్‌గా తిడితే ఎలా ఉంటుందో ఓ వీడియోను తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మోనిక. దాంతో నెటిజన్లు ఆ వీడియోను తెగ వైరల్ చేయడమే కాదు దానిపై తెగ కామెంట్లు చేస్తున్నారు. హారీ పోర్టర్, రచయిత జేకే రౌలింగ్ లాంటి వాళ్లు కూడా ఆ వీడియోను తెగ మెచ్చుకుంటున్నారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ట్రోలింగ్‌కు ఉన్న వ్యత్యాసాన్ని తెలపడం కోసమే ఈ వీడియోను రూపొందించిట్లు మోనిక చెబుతుంది. ఆన్‌లైన్‌లో వేధిస్తే ఒప్పుకునే జనాలు.. రియల్ లైఫ్‌లో వేధిస్తే ఎందుకు ఒప్పుకోరు అంటూ ప్రశ్నిస్తున్నది మోనిక. ఓ వ్యక్తిని ఎదురుగా తిడితే అతడికి అంతులేని పౌరుషం పుట్టుకొస్తుందని.. మరి ఆన్‌లైన్‌లో తిడితే ఎందుకు పట్టించుకోరంటూ ఎదురు ప్రశ్నిస్తున్నది మోనిక.

తను చేసిన సోషల్ ఎక్స్‌పరిమెంట్ వీడియో ఇదే...

1150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS