బురద గుంటలో చిక్కుకున్న ఏనుగు పిల్ల.. వీడియో

Mon,February 19, 2018 03:19 PM

Villagers rescued Baby Elephant Trapped In Well in Thailand

ఓ ఏనుగు పిల్ల బురద గుంటలో చిక్కుకుంది. దీంతో దాన్ని బయటికి తీయడానికి అక్కడి స్థానికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు దాన్ని సురక్షితంగా బయటికి లాగి శెభాష్ అనిపించుకున్నారు. ఈ ఘటన థాయిలాండ్‌లోని చంతబురి ప్రావిన్స్‌లోని కెయింగ్ హాంగ్ మయెవ్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఓ ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుంచి బయటికి వచ్చాయి. ఆ గుంపులోకి ఓ పిల్ల ఇలా బురద గుంటలో జారిపడింది. దాన్ని రక్షించడానికి తల్లి ఏనుగు బురద గుంట దగ్గరికి రాబోయేసరికి దానికి రైతులు అమర్చిన కరెంట్ తీగ ఫెన్సింగ్ తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనను గమనించిన రైతులు వెంటనే కరెంట్ తీసేయడంతో దానికి ప్రాణాపాయం తప్పింది. ఇక.. పిల్ల ఏనుగు కోసం ప్రొక్లయిన్ తెప్పించి ఆ బురద గుంటకు ఏటవాలుగా ఓ దారిలాగ తవ్వి దాన్ని ఎలాగోలా బయటికి లాగారు. దీంతో తల్లి ఏనుగుతో కలిసి ఆ ఏనుగు పిల్ల అక్కడి నుంచి తుర్రుమన్నది.

ఏనుగుల గుంపు అక్కడి వచ్చి పంటలన్నింటినీ నాశనం చేస్తున్నాయట. అందుకే వాటి బారి నుంచి తప్పించుకోవడానికి అక్కడ కరెంట్ ఫెన్సింగ్‌ను వాళ్లు ఏర్పాటు చేశారు. ఇక.. పిల్ల ఏనుగును రక్షించినపుడు తీసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరలయింది.
3555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS