17 మందిని చంపిన ఫ్లోరిడా షూటింగ్ వీడియో ఇదే..!

Thu,February 15, 2018 12:37 PM

Video show how students terrified over Florida School Shooting

ఫ్లోరిడాః అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడా హై స్కూల్లో ఓ మాజీ విద్యార్థి విచక్షణా రహితంగా కాల్పులు జరపగా.. 17 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాల్పులు జరుపుతుండగా.. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూర్చున్న వీడియోను ఓ విద్యార్థి తన సోదరికి పంపగా ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రెస్క్యూ ఆపరేషన్లలో భాగంగా కొందరు గన్స్ పట్టుకున్న పోలీసులు క్లాస్‌రూమ్‌లోకి రావడంతో విద్యార్థులంతా భయంతో చేతులు పైకెత్తడం ఈ వీడియోలో కనిపిస్తుంది. 19 ఏళ్ల నికోలస్ క్రజ్ అనే ఆ స్కూలు మాజీ విద్యార్థి ఈ కాల్పులు జరిపాడు. గతంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతన్ని స్కూల్ నుంచి వెళ్లగొట్టాడు. సుమారు 17 మందిని కాల్చి చంపిన తర్వాత అతను తనకు తానుగా పోలీసులకు లొంగిపోయాడు. అతని దగ్గరి నుంచి భారీగా మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. అతడు కాల్పులు జరిపే ముందు కావాలనే ఫైర్ అలారమ్ మోగించడంతో విద్యార్థులంతా బయటకు వచ్చారు. దీంతో వాళ్లపై అతను విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
2015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles