22ఏళ్లుగా అడవిలో ఒంటరిగా..: వీడియో వైరల్

Sat,July 21, 2018 08:15 PM

Video of the Last Survivor of Massacred Amazonian Tribe Goes Viral

వాషింగ్టన్: అమెజాన్ తెగలో మిగిలిన ఏకైక వ్యక్తి బ్రెజిల్‌లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరుదైన గిరిజన తెగకు చెందిన వ్యక్తి 22ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. బ్రెజిల్ ప్రభుత్వ సంస్థ ఫునాయ్ దృశ్యాలను తాజాగా విడుదల చేసింది.

వాయువ్య రాష్ట్రం రొండొనియాలో 1996 నుంచి ఆ వ్యక్తిని ఫునాయ్ మానిటరింగ్ చేస్తూ వస్తోంది. అరుదైన తెగకు చెందిన స‌హ‌చ‌ర వ్య‌క్తి హ‌త్య‌కు గురవడంతో అప్పటి నుంచి సుమారు 50ఏళ్ల వయస్సున్న వ్యక్తి అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగానే ఉన్నాడు. గొడ్డలితో ఒక చెట్టును నరుకుతుండగా అతనికి కొంచెం దూరం నుంచి వీడియో తీశారు. అతని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని బ్రెజిల్ ప్రభుత్వం చెబుతోంది. తన జాతికి సంబంధించిన వారు అంతమైనప్పటికీ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అతడు ఎలా మనుగడ సాగించగలుతున్నాడో అర్ధంకావడంలేదని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

14996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles